Girls Self Defense Training in Schools – Applications Invited from Agencies APSSA AKP
అనకాపల్లి జిల్లాలో గల 126 ప్రభుత్వ, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుండి 8 తరగతుల్లో చదువుచున్న 2215 మంది విద్యార్థినులకు మరియు 266 జిల్లా పరిషత్, కె. జి. బి. వి., Model Schools, మున్సిపల్, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం మరియు హై స్కూల్ ప్లస్ పాఠశాలల్లో 6 నుండి 9 తరగుతులు చదువుచున్న 27469 మంది విద్యార్థినులకు రాణి లక్ష్మీ బాయి ఆత్మ రక్ష ప్రశిక్షణ్ (Self- defence program) పథకం క్రింద తేదీ 01-02-2025 నుండి 15-03-2025 వరకు 20 సెషన్స్ క్రింద కరాటే లేదా టైక్వాండో వంటి యుద్ధ కళల్లో శిక్షణ ఇచ్చుటకు గాను Indian Companies Act, 1956 లేదా Indian Companies Act, 2013 లేదా Limited Liability Partnership Firm Act 2008 ప్రకారం రిజిస్టర్ కాబడిన Limited Liability Partnership Firm లేదా Registration Act, 1860 లేదా 1882 ప్రకారం రిజిస్టర్ కాబడిన సొసైటీ లేదా ట్రస్ట్ నుండి పై యుద్ధ కళల్లో తేదీ 31.03.2024 నాటికి కనీసం 3 సంవత్సరములు నుండి ఉనికి లో ఉండి విద్యార్థులకు శిక్షణ ఇచ్చుచున్న సంస్థల నుండి పైన తెలిపిన పాఠశాలల్లో గల విద్యార్ధినులకు శిక్షణ ఇచ్చుటకు గాను దరఖాస్తులు కోరబడుచున్నవి.
అర్హత వివరములు, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ వివరములు, ఎంపిక విధానం మరియు ధరఖాస్తు సమర్పించవలసిన సర్టిఫికేట్ వివరములు ఈ కార్యాలయపు website (apssakp.com) నందు పొందుపరచబడినవి.
ఆసక్తి గల సంస్థలు సదరు website నుండి వివరములు తెలుసుకొని పూర్తి చేయబడిన ధరఖాస్తులను తేదీ 29.01.2025 లోగా AP Samagra Shiksha, అనకాపల్లి, కొండ కొప్పాక కార్యాలయమునకు నేరుగా అందజేయవలసినదిగా కోరడమైనది.
పోస్ట్ ద్వారా పంపిన యెడల సమయం తక్కువ ఉన్నందున 29.01.2025 సాయంత్రం ఐదు గంటల లోపు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణ లోకి తీసుకొని తేదీ 30-01-2025 తేదీన ఎంపిక పూర్తి చేసి తేదీ 31-01-2025 న వర్క్ ఆర్డర్లు ఇవ్వబడునని Additional Project Coordinator, సమగ్ర శిక్షా, అనకాపల్లి వారికి పత్రికాముఖంగా కోరుచున్నారు.
దీనిని పత్రిక అంశంగా ప్రచురించవలసినదిగా అన్ని దినపత్రికలను కోరడమైనది.