AP SSA AKP – Sectoral Officers, ASO 2025 Applications Invited from Eligible Teachers
సమగ్ర శిక్ష కార్యాలయం, అనకాపల్లి.
తేది: 07.5.2025
పత్రికాసమాచారం
అదనపు సమన్వయ కర్త వారి, సమగ్ర శిక్ష కార్యాలయం, అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఈ క్రింది తెలుపబడిన (5) సెక్టోరల్ మరియు అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టులలో ఫారిన్ సర్వీస్ లో మరియు డిప్యుటేషన్ పై ఈ కార్యాలయములో పనిచేయుటకు గాను 55 సంవత్సరములు దాటని ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు తేది. 8.05.2025 నుండి 12.05.2025 సాయంత్రం 05.00 వరకు ఈ కార్యాలయములో స్వీకరించబడును. ఇందుకు సంబంధించిన పూర్తి వివరములు ఈ కార్యాలయపు నోటిస్ బోర్డు నందు పొందుపరచడమైనదని ఇందుమూలంగా అదనపు సమన్వయ కర్త, సమగ్ర శిక్ష కార్యాలయం, అనకాపల్లి జిల్లావారు తెలియజేసియున్నారు.